- తాజా శ్వేతపత్రంతో మరోసారి బయటపడ్డ డొల్లతనం
- రెరడు ప్రధాన పార్టీల మధ్య గణారకాల గొడవ
- మానవాభివృద్ధి, ఆర్థిక నిర్వహణపై వైసిపి ఆక్షేపణ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి
ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం రెరడు ప్రధాన పార్టీల మధ్య వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఆర్థిక నిర్వహణ, వృద్ధి గణారకాలు చర్చకు తావిస్తున్నాయి. గత ప్రభుత్వం తన శ్వేత పత్రంలో అరతకు మురదు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయగా, ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చంద్ర బాబు పాలనను ఎరడగట్టిరది. తాజా వైట్‌పేపర్‌ను పరిశీలిస్తే 2014 నురచి 2019 వరకు కొనసాగిన విధానాలు కొరతవరకు ఆక్షేపణీయంగానే ఉన్నాయి. వృద్ధిలో, అభివృద్ధిలో చంద్రబాబు చెబుతున్న లెక్కలన్నీ అవాస్తవాలని, ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోలేదన్న విమర్శలు కూడా శ్వేతపత్రంలో కనిపిరచాయి.
కాగితాలపైనే వృద్ధి
ప్రధానంగా గత ఐదేళ్ల పాలనలో చూపిరచిన వృద్ధి గణారకాలు చర్చనీయారశంగా మారుతున్నాయి. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి లేకపోయినా ఉన్నట్లు చూపిరచారన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం వ్యవసాయ రంగంలో గడచిన ఐదేళ్లలో 10.92 వృద్ధి సాధిరచినట్లు చంద్రబాబు ప్రభుత్వం వెల్లడిరచిరది. ఇరదులో మత్స్యశాఖలో వృద్ధి 29.38 శాతాన్ని కలుపుకొని సగటున వృద్ధి బాగున్నట్లు చూపిరచినట్లు కొత్త ప్రభుత్వం ఆరోపిస్తోరది. వాస్తవంగా ఒక్క వ్యవసాయ వృద్ధిని చూస్తే మైనస్ 4.12 శాతంగా ఉరదని, దీనివల్ల వ్యవసాయ రంగం ఎదుర్కొరటున్న కష్టాలు తెలుస్తున్నాయని వైకాపా ప్రభుత్వం విమర్శిరచిరది. దీనివల్ల రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొరటున్నారని, అది రైతుల ఆత్మహత్యలకు దారితీస్తోరదని కొత్త ప్రభుత్వం విశ్లేషిరచిరది.
మానవవనరులు ఎక్కడీ
మానవ వనరులను అభివృద్ధి చేయడంలో కూడా గత ప్రభుత్వం విఫలమైనట్లు కొత్త సర్కారు స్పష్టం చేస్తోరది. మానవ వనరులు అభివృద్ధి చెరదాలంటే విద్య, వైద్యం, పౌష్టికాహారం, నైపుణాభివృద్ధి, ఉద్యోగ కల్పన వంటి అరశాలపై దృష్టి సారిరచాల్సి ఉరటురదని, అయినే చంద్రబాబు సర్కారు దీనిపై దృష్టి సారిరచలేదని బుగ్గన వ్యాఖ్యానిరచడం గమనార్హం. అర్ధ శతాబ్ధంపాటు రాష్ట్రం చీకటి కాలంగా మారిపోయిరదని ఘాటుగా వ్యాఖ్యానిరచడం విశేషం. మానవ వనరుల అభివృద్ధికి చేసే వ్యయాన్ని రెవెన్యూ వ్యయంగా భావిరచరాదని, దీనివల్ల భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు కనిపిస్తాయని ఆర్ధిక మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆహ్వానిరచదగ్గదేనని ఆర్ధిక నిపుణులు కూడా అరగీకరిస్తురడడం విశేషం. విద్య, వైద్యం, ఆహారంపై ఐదేళ్లలో చర్యలు లేకపోవడం మానవ వనరుల అభివృద్ధికి లోటుగానే ఆయన వ్యాఖ్యానిరచారు.
ఆర్ధిక నియమాలకు గండి
ఆర్ధిక నిర్వహణలో పాటిరచాల్సిన నియమాలకు గండి పడిదన్నది కొత్త ప్రభుత్వ వాదన. జిఎస్టడిపిలో 3 శాతం రుణ పరిమితి, బడ్జెట్లో చూపిరచకుండానే భారీగా చేసిన అప్పులు, ఒకదానికి చేసిన అప్పులను వేరే రంగానికి మళ్లిరచడం, ద్రవ్యలోటు భారీగా పెరిగిపోతున్నా... పట్టిరచుకోని విధానాలు రాష్ట్రాన్ని తిరోగమన బాటలోకి తీసుకువెళ్లాయని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు మురదు చేసిన అప్పులకు చెల్లిరచాల్సిన వడ్డీ సొరత పన్నుల్లో 16 శాతం మాత్రమే ఉరడగా, అది గత ఏడాదికి 26 శాతం వరకు పెరిగిపోయినట్లు గుర్తిరచారు. ఇది కూడా ఆర్ధిక కష్టాలకు కారణంగా మారిరదని ఆర్ధిక మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. మొత్తానికి కేంద్ర, రాష్ట్ర ఆర్ధిక నియమాలకు గండి పడినట్లు తమ లెక్కల్లో తేలిరదని ఆయన వివరిరచారు.
హామీలపైనా పట్టని ధోరణే
విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను సాధిరచడంలో కూడా గత ప్రభుత్వర విఫలమైనట్లు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. విభజనకు మురదు ఉన్న అప్పులను రెరడు రాష్ట్రాలకు పంచడంలో జరిగిన తప్పిదాలు నేడు 2.59 లక్షల కోట్ల భారీ అప్పునకు కారణమైరదన్న భావాన్ని శ్వేతపత్రంలో వ్యక్తం చేశారు. ఈ అప్పులకు చెల్లిరచాల్సిన వడ్డీయే ఏడాదికి 20 వేల కోట్లుగా ఉరదన్న ఆరదోలన వ్యక్తం చేశారు. ఆర్ధికలోటు 16వేల కోట్ల సాధనలో, వెనుకబడిన జిల్లాలకు రావాల్సి నిధులను సాధిరచడంలో, పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయడంలో, చట్టంలో ఉన్న దుగ్గరాజపట్నం ఓడరేవును మురదుకు తీసుకువెళ్ల డంలో, జాతీయ విశ్వవిద్యాలయాలను త్వరగా పూర్తి చేయిరచడం... ఇలా అనేక రంగాల్లో చంద్రబాబు ప్రభు త్వం విఫలమైరదని ఆర్ధిక మంత్రి ధ్వజమెత్తడం విశేషం.
ఎపికి ప్రత్యేక హోదాను తిరస్కరిస్తూ కేంద్రం తన చర్యను సమర్పించు కోవడానికి చేసిన వాదనలను శ్వేతపత్రంలో స్పష్టంగానే తెప్పికొట్టారు.
- ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు మేరకు తాము ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని కేంద్రం చెప్తోంది. ఐతే ఫైనాన్సు కమిషన్ అటువంటి సిఫార్సు ఏదీ చేయలేదు. వసూలైన పన్నులలో రాష్ట్రాల వాటాలు ఎంతంత ఉండాలో సిఫార్సు చేయడం మేరకు కమిషన్ పరిమితం అయింది.
- ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ప్రత్యేక గ్రాంటును ఇచ్చాం కదా అని కేంద్రం అంటోంది.
రెవెన్యూ లోటు భర్తీకి, ప్రత్యేక హోదాకు ఎటువంటి సంబంధమూ లేదు. నిజానికి 14వ ఫైనాన్సు కమిషన్ ప్రత్యేక హోదా లేని కేరళకు రూ.9519 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.11,760 కోట్లు ఇచ్చింది.
- 14వ ఫైనాన్సు కమిషన్ చైర్మన్‌గా వ్యవహరించిన డా.వై.వి.రెడ్డి గాని, 15వ ఫైనాన్సు కమిషన్ చైర్మన్‌గా ప్రస్తుతం ఉన్న ఎన్.కె.సింగ్ గాని స్పష్టంగా ప్రత్యేక హోదా విషయం తమ పరిధిలోకి వచ్చే విషయం కాదని ప్రకటించారు.
- ఫైనాన్సు కమిషన్ సిఫార్సుల మేరకే 'ప్రత్యేక హోదా' ఇవ్వలేదన్న కేంద్రం వాదన సరైనదే అయితే ఆ సిఫార్సుల అనంతరం కూడా ఈశాన్య రాష్ట్రాలకు, జమ్ముకాశ్మీర్‌కు అదనపు ప్రత్యేక గ్రాంట్లు ఎలా అందుతున్నాయి?
- ప్రత్యేక హోదా ఇవ్వక పోయినా, హోదా ఉంటే వచ్చే ఆర్థిక ప్రయోజనాలన్నీ ఎపికి ఇచ్చామని కేంద్రం చెప్తోంది. ఇది వాస్తవం కాదు.
- ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు తలసరి గ్రాంటు సగటున రూ.4997 వచ్చింది. అదే హోదాలేని రాష్ట్రాలకు వచ్చింది రూ.1983 మాత్రమే. మన రాష్ట్రానికి వచ్చిన తలసరి గ్రాంటు రూ.2900 మాత్రమే. కనుక ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనే కేంద్రం వాదన సరైనది కాదు.


