ప్రజాశక్తి-అమరావతి:
అక్రమ మైనింగ్ ఆరోపణల కేసులో మాజీ ఎంపీ, టిడిపి నేత జెసి దివాకర్‌రెడ్డి, త్రిశూల్ సిమెంట్స్ కంపెనీల భాగస్వాములు ఎస్.గోపాలరావు, టి.దేవపుత్రుడు, షేక్ హుస్సేన్, నాగసుబ్బారాయుడు ఇతరులకు బుధవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ మానవేంద్రనాథ్రారులతో కూడిన డివిజన్ బెంచ్ నోటీసులు ఇచ్చింది. అనంతపురం జిల్లా యాకిడి మండలం కొనుప్పలపాడులోని సర్వే నెం 22 బిలోని 1605 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని, తాడిపత్రికి చెందిన వి.మురళీప్రసాద్‌రెడ్డి 2011లో వేసిన కేసులో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలోనే జెసి, ఇతరులకు హైకోర్టు నోటీసులిచ్చింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణకు రాలేదు. ఆ నోటీసులు జెసి ఇతరులకు అందాయో లేవో అనే సందేహంతో మరోసారి నోటీసులు ఇస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. విచారణ అక్టోబర్‌కు వాయిదా పడింది.
అక్రమ మైనింగ్ కేసులో జెసి దివాకరరెడ్డి తదితరులకు నోటీసులు
