రాజోలు : డిజైన్ ఫర్ ఛేంజ్ -2019 అంతర్జాతీయ పోటీలలో మండలంలోని కడలి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసుకున్న ‘నేను చేయగలను’ (ఐ కెన్ ఛాలెంజ్) అనే విభాగములో అంతర్జాతీయ స్థాయిలో కడలి పాఠశాల 100వ స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో స్మార్ట్ విలేజ్ మూమెంట్ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు రాయుడు ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఇఒ జొన్నలగడ్డ గోపాలకృష్ణ మాట్లాడుతూ... డిజైన్ ఫర్ ఛేంజ్ -2019 వారు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కడలి పాఠశాల విద్యార్థులు 100వ స్థానంలో రావడం చాలా సంతోషంగా ఉందని ‘డిజైన్ ఫర్ చేంజ్’ అనే ప్రణాళిక ద్వారా ప్రతి విద్యార్థి ‘నేను చేయగలను’ అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఎంపిక చేసుకున్నా అంశం ‘మధ్యాహ్నం భోజనంలో ఆహారం వృధా కాకుండా’ అనే అంశము అంతర్జాతీయ స్థాయిలో వందో స్థానములో నిలవడం గర్వకారణంన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్కింసెట్టి గోపి, వీర రాఘవులు, సుచిత్ర, స్మార్ట్ విలేజ్ బృంద సభ్యులు పాల్గొన్నారు.
డిజైన్ ఫర్ ఛేంజ్ -2019 కడలి స్కూల్ కు వందో స్థానం
