గ్రామ, వార్డువాలంటీర్ల ఎంపిక ప్రక్రియ గురువారం ప్రాంరభమైంది. చిత్తూరు నగర పాలక సంస్థలోని 50 డివిజన్లకు వార్డు వాలంటీర్ల ఎంపిక నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర కమిషనర్ ఓబులేసు, మరో ఇద్దరు ప్రత్యేక అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో గురువారం 30 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇదిలా ఉంటే తమ వారినే ఎంపిక చేయాలంటూ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
సర్టిఫికెట్లు తప్పనిసరి
ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులు స్తానికత, కుల, విద్యార్హుత, ఇతర అర్హతలున్న ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసురావాలి ఎప్పుడు ఇంటర్వ్యూకు రావాలనే విషయాన్ని అభ్యర్థుల ఫోన్‌కు మెసేజ్‌లు పంపుతారు. రోజుకు రెండు షిప్టులుగా ఇంటర్వ్యూలు ఉంటాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
పాకాలలో గ్రామవాలంటీర్ల భర్తీకి ఇంటర్వ్యూను ఎంపిడిఒ అమరనాథ్ ప్రారంభించారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ వాలంటీర్ల ఇంటర్యూకి 30 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. నేటి నుండి ఈనెల 23వతేదీ వరకు మండలంలో వాలంటీర్ల భర్తీకి ధరఖాస్తు చేసుకున్న 778 మందికి ఇంటర్వూలు నిర్వహించి అందులో అర్హత సాధించిన 331 మంది అభ్యర్థులకు వాలంటీర్లుగా నియమించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటి తాహశీల్ధార్ పార్థసారథి, సూపరిండెంట్ ప్రసాద్‌లు
గుడిపాలలో గ్రామ వాలంటీర్లకు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ బాలగణేష్, పంచాయితీల విస్తరణాధికారి శివరాజన్, ఆర్ఐ శశికల ఇంటర్వూలను నిర్వహించారు. 30 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 22 మందికి ఇంటర్వ్యూలకు హాజరయినట్లు తెలిపారు.
బంగారుపాళ్యంలో సంక్షేమ పథకాల బాధ్యత గ్రామ వాలంటీర్లదే అని జెడ్పి సిఇఒ ఓబులేసు అన్నారు. గురువారం మండల అభివద్ధి అధికారి కార్యాలయంలో గ్రామ వాలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తనిఖీ నిమిత్తం వచ్చిన జెడ్పి సిఇఒ ఓబులేసు మాట్లాడుతూ గ్రామాల్లో ఎంపికైన వాలంటీర్లు చక్కగా పనులు చేయాలని, ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు, నవరత్న పథకాలు అందించి ప్రజల వద్ద మన్నెనలు పొందాలని అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు సంపూర్ణ మద్దతు ఏర్పడుతుందన్నారు. అనంతరం ఇంటర్వ్యూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలం ప్రత్యేక అధికారి నారాయణ మూర్తి ఎంపిడిఒ విద్యా రమా, పిఓపిఆర్డి శకుంతల, వ్యవసాయ అధికారి అజరు కుమార్, డిప్యూటీ తాసిల్దారు అహ్మద్ భాషాలు పాల్గొన్నారు.
గంగాధర నెల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ వాలంటీర్ల ఎంపికలో పారదర్శకంగా మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుందని మండల ప్రత్యేక అధికారి వ్యవసాయ శాఖ ఏడీ మనోహర్‌బాబు తెలిపారు. గురువారం మండల కార్యాలయంలో వాలంటీర్ల ఇంటర్వ్యూలు నిర్వహించారు. 14 మంది గైర్హాజరయ్యారు. మిగిలిన వారికి అధికార్లు పలు ప్రశ్నలతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో మార్కుల ఆధారంగా కేటగిరి పద్ధతిలో ఎంపిక చేస్తూ 50శాతం మహిళలను ఎంపిక చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేయనున్నట్లు వారు తెలిపారు. మండలంలో 1,543మంది దరఖాస్తు చేసుకోగా మండలానికి కావలసిన వాలంటీర్ల సంఖ్య 328 మంది మాత్రమేనని వారు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలను రేపటి నుంచి 120 మంది దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు చేయనున్నట్టు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలలో ఎంపిడిఒ రెడ్డిబాబు, ఉపతహశీల్దార్ చంద్రబాబు, గహ నిర్మాణ శాఖ ఎఇ వెంకటరమణ, ఇఒపిఆర్‌డి దుర్గాప్రసాద్ నిర్వహించారు.