గుడివాడను కాలుష్య రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని జాయింట్ కలెక్టరు-2, గుడివాడ పురపాలక సంఘ ప్రత్యేకాధికారి పిడుగు బాబూరావు అన్నారు. గురువారం పట్టణంలో పారిశుద్ద్య పనులు నిర్వాహణ, పర్యవేక్షణలో భాగంగా మున్సిపల్ కమీషనరు డా.ఎ.శామ్యూ ల్తో కలసి ఆయన పలు వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య రహిత పట్టణంగా గుడివాడను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కాలుష్యాన్ని అరికట్టే విధంగా భాద్యతను వహించాలన్నారు. ఈ సందర్బంగా స్థానిక 28వ వార్డు పెదపేటలో పర్యటించి డ్రైనేజీలు, రోడ్లును పరిశీలించారు. స్దానిక పెదపేటలోని చికెన్ సెంటరు యజమాని వ్యర్థపదార్థాలను డ్రైనేజీలో వేయడం వలన దుర్గందభరితంగా మారిన డ్రైయిన్ చూసి చికెన్ సెంటరును సీజ్్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల వెంబడి బహిరంగ మూత్ర విసర్జన చేయడం వలన డయారియా వంటి ప్రజారోగ్య సమస్యలు ఏర్పడేందుకు అవకాశం ఉందని కావున ప్రతి ఒక్కరూ విధిగా పర్యావరణం పరిశుభ్రత పట్ల తమ భాద్యతలను నిర్వహించాలని ప్రజలకు విజప్తి చేసారు. ప్లాస్టిక్ కవర్లు వాడకం నిషేదించాలని, రోడ్లు, డ్రైన్లుపై చెత్త వేయరాదని, నిర్థేశించిన ప్రదేశాల్లో మాత్రమే వేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ డా.ఎ.శామ్యూల్ మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధలో 107 మంది పర్యావరణ మిత్రలు విధులు నిర్వహిస్తున్నారని వారు ఇంటింటికి వెళ్ళి ప్రజల్లో పర్యావరణం పట్ల ప్రజల్లో కల్పిస్తున్నారన్నారు. నేను సైతం గుడివాడ స్వచ్చ సేవలో అనే 20వేల డోర్ స్టిక్కర్లును ఇంటింటికీ అంటించి ప్రజల్లో పర్యావరణం, కాలుష్య నివారణ పట్ల చైతన్యం తీసుకువస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాలుష్యరహిత పట్టణంగా గుడివాడను తీర్చిదిద్దుతాం
