సౌకర్యవంతమైన డిజైన్, మెరుపు వేగానికి పెట్టింది పేరు రాయల్ ఎన్ఫీల్డ్. బైక్‌ల గురించి ఆలోచించగానే మొదట గుర్తొచ్చేది ఈ ద్విచక్రవాహనమే. దాంట్లో మళ్లీ బుల్లెట్ మోడల్‌కి ఉండే క్రేజే వేరు. భారత విపణిలో అత్యంత విజయవంతమైన బైక్‌లలో ఇదొకటి. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350కేఎస్(కిక్ స్టార్ట్)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది మొత్తం మూడు రంగులు.. బుల్లెట్ సిల్వర్, సఫైర్ బ్లూ, ఒనిక్స్ బ్లాక్‌లో అందుబాటులో ఉందనుంది. దీని ధరను రూ.1.12 లక్షలుగా నిర్ణయించారు.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. హ్యాండ్ పెయింటెడ్ ఫ్యుయల్ ట్యాంక్, పిన్‌స్ట్రిప్స్, లెయిడ్ బేర్ ఇంజిన్ ఆకర్షణీయంగా ఉన్నాయి. సింగిల్ సిలిండర్, ఫోర్ స్ట్రోక్, ట్విన్ స్పార్క్, ఎయిర్ కూల్డ్, 346 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 19.8బీహెచ్పీ, 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ ఛానల్ యాంటీ బ్రేకింగ్ సిస్టంను పొందుపరిచారు. రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్ కేంద్రాల్లో ఈ బైక్‌ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.ఐదు వేల ముందస్తు చెల్లింపుతో బైక్‌ని బుక్ చేసుకోవచ్చు.