ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ అంచనాల కమిటీ(ఎస్టిమేట్స్ కమిటీ) సభ్యులుగా టిడిపి ఎంపి కేశినేని నాని, వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎన్నికైయ్యారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఎస్టిమేట్స్ కమిటీ 29 మంది సభ్యులతో ఎన్నికైంది. అందులో ఏపి నుంచి ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ పదవీ కాలం 2020 ఏప్రిల్ 30తో ముగుస్తుంది.
అంచనాల కమిటీ సభ్యులుగా కేశినేని నాని, మాగుంట శ్రీనివాసులు రెడ్డి
