* కేంద్రం, యుఐడిఎఐకి సుప్రీం ఆదేశాలు నోటీసులు
న్యూఢిల్లీ : ఆధార్ చట్ట సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని, యునిక్ ఐడెంటిఫికేషన్ అథార్టీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ)ని ఆదేశించింది. ఆధార్ చట్టానికి ఇటీవల చేసిన సవరణలు ప్రైవేటు కంపెనీలు దొడ్డిదారిన సాధారణ వ్యక్తుల డేటాను చేజిక్కించుకునేందుకు అనువుగా ఉన్నాయని ఆ పిటిషనర్లు పేర్కొన్నారు.
మాజీ సైనికాధికారి ఎస్జి వోంబత్కేర్, సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్ సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆధార్ ఇతర చట్టాల చెల్లుబాటు (సవరణ) చట్టం-2019, ఆధార్ (ఆధార్ ప్రామాణిక సేవల ధరల) నిబంధనల నిర్ణయ చట్టం-2019ల చట్టబద్ధతను పిటిషనర్లు ప్రశ్నించారు. దీనిపై స్పందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ.బాబ్డే, న్యాయమూర్తి బిఆర్ గవారులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఆధార్ చట్టాలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఇదే పిటిషనర్లు అంతకుముందు దాఖలు చేసిన పిటిషన్లకు ఈ తాజా పిటిషన్‌ను ధర్మాసనం జత చేసింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది విపిన్ నాయర్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రాజ్యాంగంలోని మూడో ప్రకరణ పౌరులకు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఆధార్ సంబంధిత చట్టాలు ఉల్లంఘిస్తున్నాయని ఆ పిటిషన్ పేర్కొంది.
ప్రైవేటు చేతుల్లోకి ఆధార్ ఎలా?
