కావలసినవి: పులస చేప: కిలో, నూనె: 100 గ్రా., ఉల్లిపాయలు: పావుకిలో, రాక్‌సాల్ట్(సైంధవ లవణం): తగినంత, పసుపు: టీస్పూను, చింత పండుగుజ్జు: అర కప్పు, బెండకాయలు: ఆరు, కొత్తిమీర కట్ట, వెల్లుల్లి: 3 రెబ్బలు, కరివేపాకు: 2 రెబ్బలు,జీలకర్ర: 2 టీస్పూన్లు, ఆవకాయలో తేలే నూనె: 2 టేబుల్‌స్పూన్లు, చేపకారం: 2 టేబుల్ స్పూన్లు (కారం, దనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ సమంగా తీసుకుని విడివిడిగా వేయించి పొడి చేయాలి), కొబ్బరి బోండాలు: రెండు(లేదంటే నీళ్లు వాడవచ్చు)
తయారుచేసే విధానం: చింతపండుని గుజ్జులా చేసి కొబ్బరినీళ్లలో నానబెట్టాలి.కాస్త నూనెలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి వీటికి జీలకర్ర, వెల్లుల్లి జోడించి ముద్దలా చేయాలి. బాణలిలో మిగిలిన నూనె వేసి ఉల్లిముద్దని వేయించాలి. శుభ్రంగా కడిగిన చేప ముక్కలు వేసి, కారం చల్లి ఓ నిమిషం ఉడికించాలి. చింతపండు గుజ్జు, కొబ్బరినీళ్ల మిశ్రమం పోసి, బెండకాయ ముక్కలు వేసి ఉడికించాలి. చివరగా ఆవకాయలో పైన తేలే నూనె, వెన్న, కొత్తిమీర తురుము వేసి దించి వేడివేడిగా వడ్డించాలి.