- తుదిపోరుకు కివీస్
మాంచెస్టర్ : ప్రపంచకప్ టోర్నిలో భారత క్రికెట్ జట్టు కథ ముగిసింది. సెమీ ఫైనల్లో భారత్‌పై న్యూజిలాండ్ 18 పరుగులతో విజయం సాధించింది. 240 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమయింది. 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పరుగుల రారాజు రోహిత్, పరుగుల యంత్రం కోహ్లి ఒక్క పరుగుకే నిష్క్రమించగా, రాహుల్, దినేశ్ కార్తీక్‌లు వీరినే అనుసరించారు. దీంతో కష్టాల్లో పడిన భారత్‌ను జడేజా (77 పరుగులు), ధోని (50) జోడీ ఆదుకున్నా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. కీలక సమయంలో ధోని రనౌటయ్యాడు. దీంతో వరసగా రెండోసారి ప్రపంచకప్‌లో సెమీస్ నుంచి భారత్ ఇంటి దారి పట్టింది. ఈ నెల 14న జరిగే ఫైనల్‌కు కివీస్ సిద్దమయింది.
భారత్ కథ ముగిసే ...
