ప్రజాశక్తి-పలాస
ఆర్టిసి కార్మికుల సంక్షేమమే ఎంప్లాయిస్ యూనియన్ ధ్యేయమని ఎంప్లాయిస్ యూనియన్ డిపో అధ్యక్ష, కార్యదర్శులు జగ్గారావు, ఎ.వి.కుమార్, వరహాలమ్మ అన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ 68వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం పలాస ఆర్టిసి డిపో ఆవరణలో కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 67 ఏళ్లుగా కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధికి ఎంప్లాయిస్ యూనియన్ కృషి చేస్తుందన్నారు. అనేక పోరాటాలు ఫలితంగానే కార్మికులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. అనంతరం పలువురు కార్మికులు ఎంప్లాయిస్ యూనియన్లో చేరారు. కార్యక్రమంలో జగన్నాథరావు, కె.కృష్ణారావు, టి.వరహాలు, టి.సిహెచ్.రావు, జి.కె.రాజు, సుధ, చిన్నా తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమమే ధ్యేయం
