అమరావతి: సీఎం జగన్తో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసిపి ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపిను వీడి వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. వంశీపై పోటీ చేసి ఓటమిపాలైన యార్లగడ్డ.. ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో యార్లగడ్డను బుజ్జగించేందుకు వైసిపి అధిష్ఠానం రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా సోమవారం సాయంత్రం జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.. యార్లగడ్డను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లారు. తన రాజకీయ భవిష్యత్తుపై సీఎంతో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం.
సిఎం జగన్తో ముగిసిన గన్నవరం పంచాయతీ
