ప్రజాశక్తి- భవానీపురం
జక్కంపూడి పరిసర ప్రాంతాలలో ముంపును నివారించే విధంగా పాముల కాలువను 16.50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. గురువారం జక్కంపూడి సమీపంలో పాములకాలువ ప్రాంతాన్ని కలెక్టర్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ అధిక వర్షాలలో ముంపు నీరు పాములకాలువ ద్వారా బుడమేరులో కలిసే విధంగా ఈ కాలువను అభివృద్ధి చేస్తున్నామని దీనిద్వారా జక్కంపూడి పరిసర ప్రాంతాలలో ముంపును నివారించవచ్చునని కలెక్టర్ అన్నారు. ఇరిగేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు సంయుక్తంగా ఈ కాలువ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారని ఇందుకు సంబంధించి 16.50 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ వెంట విజయవాడ రూరల్ తాహశిల్దార్ ఎం.రవీంద్రబాబు, ఇరిరేషన్ ఏఈ బి.కొండ, వియంసీ ఇంజనీర్ మధు, తదితరులు ఉన్నారు.
రూ. 16.5 లక్షలతో అభివృద్ధి పనులు
