ప్రజాశక్తి - చింతలపూడి
జనాభా పెరుగుదలను తగ్గించి మొక్కలను పెంచాలని చింతలపూడి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. పట్టణంలో గురువారం డిగ్రీ కళాశాల నందు స్పూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు సంపద, మౌళిక వసతులు కల్పించడం ఎవరికైనా అసాధ్యమే అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. అనంతరం ఎస్బిఐ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, వ్యక్తిత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మణిమాల అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం కళాశాల అద్యాపకులు ఎస్ఐని ఘనంగా సత్కారించారు. ఈ కార్యక్రమంలో అర్థశాస్త్రం అధ్యాపకురాలు శోభా స్ఫూర్తి స్వచ్ఛంద అధ్యక్షులు ఎస్.కె మొహిద్దిన్ పాల్గొన్నారు.
బాధ్యతతో మొక్కలను పెంచాలి
