- 9 మంది మృతి
- 66 మందికి పైగా గాయాలు
ఇస్లామాబాద్ : గురువారం వేకువ జామున పాకిస్తాన్లో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాద ఘటనలో కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 60 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని రహీమ్ యార్ఖాన్ జిల్లాలో లాహోర్ నుండి వస్తున్న ఒక ప్రయాణీకుల రైలు క్రాసింగ్ వద్ద నిలిచి వున్న గూడ్స్ రైలును ఢకొీనటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారని, వారి మృతదేహాలను మార్చురీకి తరలించామని స్థానిక పోలీసు అధికారి ఉమర్ సలామత్ మీడియాకు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా వుందని ఆయన చెప్పారు. ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించినట్లు పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్‌రషీద్ అహ్మద్ మీడియాకు చెప్పారు.
పాక్‌లో రెండు రైళ్ల ఢీ
