ప్రజాశక్తి - రాయచోటి టౌన్
తీసేశారని, అమ్మఒడిని అందరికీ ఇవ్వడం వల్ల హైస్కూల్ విద్యార్థులు కూడా ప్రయివేటు విద్యా సంస్థలకు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని కోరారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలని కోరారు. విద్యను వ్యాపారం చేస్తున్న ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోని, విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలపై ఈనెల 15న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఫయాజ్, విద్యార్థులు పాల్గొన్నారు.