విజయవాడ: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని గవర్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో గవర్నర్ మొక్కలు నాటారు. దేశీయ వరి రకాలు, వాటి ప్రత్యేకతలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
