న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఈ నెలాఖరులో జరిగే డేవిస్‌కప్ మ్యాచ్ తటస్థ వేదికను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) మంగళవారం ప్రకటించింది. కజకిస్తాన్ రాజధాని నూర్-సుల్తాన్‌లో ఇరుజట్ల మధ్య నవంబర్ 29-30న డేవిస్ కప్ పోటీలు జరగనున్నాయి. పాకిస్తాన్లో పర్యటించేందుకు భారతజట్టు అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో ఐటిఎఫ్ పాకిస్తాన్లో భద్రతా కారణాల వల్ల వేదికను మార్చాలని కోరింది. దీంతో పోటీల వేదిక మార్చేందుకు తొలుత పాక్ నిరాకరించినా... ఆ తర్వాత నవంబర్ 4న తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించింది. వేదికల మార్పు విషయమై పాకిస్తాన్ టెన్నిస్ ఫెడరేషన్(పిటిఎఫ్) డేవిస్ కప్ కమిటీకి త్వరలో ఫిర్యాదు చేయనుంది.
కజకిస్తాన్‌లో భారత్-పాక్ డేవిస్ కప్
