- పాకిస్తాన్తో ఎసిసి ఎమర్జింగ్ కప్
ఢాకా: ఎసిసి ఎమర్జింగ్ కప్ సెమీఫైనల్లో భారత యువజట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన సెమీస్ పోటీలో దాయాది పాకిస్తాన్ చేతిలో 3 పరుగుల తేడాతో ఓడి టోర్నీనుంచి నిష్క్రమించింది.
తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ఓపెనర్ యుసుఫ్(66), హైదర్(43) తొలి వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. శివమ్ మావి(2/53), దూబ ే(2/60) రాణించారు. అనంతరం రవి(47), ఆర్యన్(17) తొలి వికెట్కు 43 పరుగులు జతచేయగా.. సన్వీర్సింగ్(76), జాఫర్(46) మెరవడంతో భారత యువ జట్టు 38.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 211 పరుగులు పటిష్ట స్థితిలో ఉంది. ఆ తర్వాత పాక్ బౌలర్లు చెలరేగడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 264 పరుగులు మాత్రమే చేయగల్గింది. చివరి ఓవర్లో 7 పరుగులు చేయల్సిన భారత్... అమద్ భట్ వేసి ఓవర్లో 4 పరుగులు మాత్రమే చేసింది.
సెమీస్లో భారత యువజట్టు ఓటమి
