- కొరియా మాస్టర్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
గ్వాంఝూ: కొరియా మాస్టర్స్‌లో భారత్‌కు శుభారంభం దక్కింది. మాజీ ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్, యువ షట్లర్ సమీర్ వర్మ పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లోకి ప్రవేశించారు. ఆరోసీడ్‌గా బరిలోకి దిగిన కిదాంబి 21-18, 21-17 పాయింట్ల తేడాతో విన్సెంట్(హాంకాంగ్)ను చిత్తుచేశాడు. ఈ మ్యాచ్‌ను శ్రీకాంత్ కేవలం 37 నిమిషాల్లోనే ముగించడం విశేషం. రెండోరౌండ్లో కిదాంబి జపాన్‌కు చెందిన సునెయామతో తలపడనున్నాడు. సమీర్‌వర్మ 11-8 పాయింట్ల ఆధిక్యతలో ఉండగా ప్రత్యర్ధి ఆటగాడు కజుమస సకారు(జపాన్) మ్యాచ్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. దీంతో భారత షట్లర్ నేరుగా రెండోరౌండ్లోకి ప్రవేశించాడు. తన సోదరుడు సౌరభ్ వర్మ 21-13, 12-21, 13-21 పాయింట్ల తేడాతో స్థానిక ఆటగాడు కిమ్-డాంగున్ చేతిలో పోరాడి ఓడాడు. ఈ టోర్నీలో భారత్ నుంచి మహిళా షట్లర్లు ఎవ్వరూ బరిలోకి దిగని సంగతి తెలిసిందే.
శ్రీకాంత్, సమీర్ శుభారంభం
